గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (10:46 IST)

దేశంలో కొత్తగా 25 వేల పాజిటివ్ కేసులు - 492 మంది మృతి

దేశంలో కొత్తగా మరో 25,920 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 492 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ పాజిటివిటీ రేటు 2.07గా నమోదైంది. ఇకపోతే, కరోనా వైరస్ నుంచి కోలుకున్న మొత్తం బాధితుల సంఖ్య 4,19,77,238గా నమోదైందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 2,92,092 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 2.07శాతంగా ఉంది. అలాగే, కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,19,77,238గా ఉంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా మొత్తం 174,64,99,461 డోసుల వ్యాక్సిన్లు వేశారు.