గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 జులై 2021 (19:16 IST)

ఆంధ్రప్రదేశ్ మళ్లీ పెరుగుతున్న పాజిటివ్ కేసులు.. కొత్తగా 2526

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2526 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనాతో మరో 16 మంది మృతి చెందారు. 
 
ఇకపోతే, గడిచిన 24 గంటల్లో కొత్తగా 3001 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాల ప్రకారం మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,31,555 కు చేరుకోగా.. డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 18,96,499 కు పెరిగాయి.
 
ఇక కరోనా కారణంగా మొత్తం మరణాల సంఖ్య 13,097కి చేరింది. అలాగే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2485 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుతోంది.