శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 ఆగస్టు 2021 (17:01 IST)

ఏపీలో మరో 1248 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఫలితంగా గత 24 గంటల్లో మరో 1248 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 58890 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఈ కేసులు నమోదయ్యాయి. 
 
దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసులు సంఖ్య 20,04,590కి పెరిగింది. వైరస్‌ బారినపడిన వారిలో మంగళవారం 1,715 మంది కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 19,77,163కు చేరింది. కరోనా వైరస్ సోకడం వల్ల మరో 15 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాలు 13,750కి చేరినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.