శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 మే 2022 (11:35 IST)

దేశంలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

covid test
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసులపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. గత 24 గంటల్లో 4.71 లక్షల మంతికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా, 2827 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తేలింది. 
 
అదేసమయంలో కరోనా నుంచి 3230 మంది కోలుకున్నారు. మరో 24 మంది చనిపోయారు. కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా  ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 19067 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
ఇదిలావుంటే, తాజా కేసులతో కలుపుకుంటే దేశంలో ఇప్పటివరకు మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,13,413కు చేరుకుంది. అలాగే, 4,25,70,165 మంది ఈ వైరస్ నుంచి కోలుకోగా, 5,24,181 మంది చనిపోయారు.