సోమవారం, 20 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 జులై 2022 (10:52 IST)

దేశ వ్యాప్తంగా 17,070 కరోనా పాజిటివ్ కేసులు

covid19
దేశ వ్యాప్తంగా 17070 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఈ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ కొత్త కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 4,34,69,234కు చేరుకున్నాయి. ఇందులో 4,28,36,906 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. 
 
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల్లో 5,25,139 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1,07,189 మంది వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు మొత్తం 23 మంది చనిపోగా, 14,413 మంది వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 
 
అయితే, రోజువారీ పాజిటివిటీ రేటు 3.20 శాతంగా ఉందని కేంద్రం పేర్కొంది. మొత్తం కేసుల్లో 0.24 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు తెలిపింది. రికవరీ రేటు 98.55 శాతంగాను, మరణాల రేటు 1.21 శాతంగా ఉన్నట్టు పేర్కొంది.