గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (10:19 IST)

దేశంలో కొత్తగా మరో 25 వేల పాజిటివ్ కేసులు

దేశంలో కొత్తగా మరో 25 వేల పైచిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు... గ‌త 24 గంట‌ల్లో 25,404 కోవిడ్ పాజిటివ్ కేసులు న‌మోదైనట్టు పేర్కొంది.  
 
అలాగే, ఈ వైరస్ బారినుంచి సుమారు 37 వేల మంది కోలుకున్నారు. ఇక గ‌త 24 గంట‌ల్లో వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 339గా ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. కరోనా వైరస్ బారినపడి ఇప్పటివరకు 4,43,213 మంది చనిపోయారు. 
 
మరోవైపు, దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇప్పటికే 75 కోట్ల మార్క్‌ను దాటిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ ట్వీట్ చేశారు. గ‌త 24 గంట‌ల్లో 78,66,950 మందికి క‌రోనా టీకా వేసిన‌ట్లు ఆయ‌న చెప్పారు.