శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 సెప్టెంబరు 2021 (12:09 IST)

దేశంలో ఒక్కసారి భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఒక్కసరి భారీగా పెగిగాయి. మంగళవారం 30 వేల వరకు పాజిటివ్ కేసులుగా ఉండగా, గడిచిన 24 గంటల్లో ఈ కేసుల సంఖ్య 40 వేలు దాటింది. మొత్తం 41,965 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క కేరళ రాష్ట్రం నుంచే అధిక కేసులు ఉన్నాయి.
 
ఇదేసమయంలో 33,964 మంది కోలుకోగా... 460 మంది మృతి చెందారు. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,28,10,845కి పెరిగింది. మొత్తం 3,19,93,644 మంది కోలుకున్నారు. 
 
అలాగే, ఇప్పటివరకు 4,39,020 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 3,78,181 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కరోనా టీకాల కార్యక్రమంలో భాగంగా, 65,41,13,508 డోసుల వ్యాక్సిన్ వేశారు. గత 24 గంటల్లో 1,33,18,718 టీకాలు వేశారు. మన దేశంలో అధిక కేసులు కేరళలో నమోదవుతున్నాయి.