దేశంలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులెన్ని?
దేశంలో కొత్తగా మరో 13,091 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే విషయంపై కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.
కరోనా వల్ల బుధవారం 340 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలుపుకుని మొత్తం మృతుల సంఖ్య 4,62,189కు చేరింది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 1,38,556 మంది చికిత్స తీసుకుంటున్నారు.
గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 13,878 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి ఇప్పటివరకు మొత్తం 3,38,00,925 మంది కోలుకున్నట్టయింది.
బుధవారం దేశంలో 57,54,817 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. మొత్తం వినియోగించిన డోసుల సంఖ్య 1,10,23,34,225కు చేరింది. నిన్న 11,89,470 కరోనా పరీక్షలు చేశారు.