శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 ఏప్రియల్ 2021 (13:42 IST)

సెలెబ్రిటీలు ఓవర్.. ఇక సీఎంల వంతు.. త్రిపుర సీఎంకు కరోనా

దేశంలో కరోనా సెకండ్ వేవే నడుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ నటులు సామాన్య ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ కుమార్ కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్యయంగా ఆయన ఒక ట్వీట్‌లో వెల్లడించారు. తనకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ రావడంతో వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నట్టు ఆయన తెలిపారు. 
 
కరోనా నిబంధనలు, సూచనలను ప్రతి ఒక్కరూ సక్రమంగా పాటించి సురక్షితంగా ఉండాలని ఆయన సూచించారు. మరోవైపు, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1.15 లక్షల కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదవుతుండగా, బెంగళూరు, ఢిల్లీలోనూ కోవిడ్ కేసులు పెరుగుతుండటంపై పలు ఆంక్షలు అమల్లోకి తెచ్చారు.