ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 నవంబరు 2023 (11:21 IST)

అమెరికాలో కోవిడ్ కొత్త వేరియంట్.. పేరు హెచ్‌వీ1

omicron
అమెరికాలో కోవిడ్ కొత్త వేరియంట్ ఆందోళనకరంగా మారింది. ఈ వేరియంట్ పేరు HV.1.అమెరికాలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీనికి కారణం కొత్తగా ఉద్భవించిన కరోనా వేరియంట్ హెచ్‌వీ.1. ఈ కోవిడ్ వేరియంట్ హెచ్‌వీ.1 వ్యాప్తి ఆందోళనకరంగా ఉన్నట్లు కనిపిస్తోంది 
 
యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, అక్టోబర్ 28 నుండి వెలుగులోకి వచ్చిన కోవిడ్ కేసులలో హెచ్‌వీ.1 వేరియంట్ వాటా 25.2శాతం ఉంది. జూలైలో వెలుగులోకి వచ్చిన కేసులలో దీని వాటా 0.5 శాతం. కానీ ఇప్పుడు అది 12.5 శాతానికి పెరిగింది. ఫలితంగా, ఇది అమెరికాలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న వేరియంట్‌గా మారింది.
 
హెచ్‌వీ.1 కోవిడ్ వేరియంట్: "కోవిడ్ వైరస్‌లు పరివర్తన చెందుతాయి. ఇది మేము ఇప్పటికే అర్థం చేసుకున్నాం. ఈ హెచ్‌వీ.1. ఓమిక్రాన్ సబ్‌వేరియంట్‌లను పోలి ఉంటుంది” అని వాండర్‌బిల్ట్ యూనివర్సిటీ మెడికల్ తెలిపింది. 
 
హెచ్‌వి.1ని ఓమిక్రాన్ మనవడిగా పరిగణించవచ్చని సెంటర్ ప్రొఫెసర్ డాక్టర్ విలియం షాఫ్నర్ వెల్లడించారు. జలుబు, తలనొప్పి, గొంతు నొప్పి, దగ్గు, గొంతు నొప్పి, కీళ్ల నొప్పులు ఈ HV.1 కోవిడ్ వేరియంట్ లక్షణాలు.
 
చలికాలం సమీపిస్తున్న నేపథ్యంలో హెచ్ వీ-1 వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షలు, స్క్రీనింగ్ వంటి చర్యలు అమలు చేస్తున్నారు.