శుక్రవారం, 22 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. మహామహులు
Written By
Last Updated : సోమవారం, 8 జులై 2019 (13:29 IST)

#HappyBirthdayDada సచిన్‌తో కలిసి ఏం కొట్టావయ్యా @12400 పరుగులు?

టీమిండియా మాజీ కెప్టెన్, దాదా సౌరవ్ గంగూలీకి జూలై 8వ తేదీ పుట్టిన రోజు. 1972 జూలై 8న జన్మించిన గంగూలీ పూర్తి పేరు సౌరవ్‌ చండీదాస్‌ గంగూలీ. లెఫ్టార్మ్‌ బ్యాట్స్‌మన్‌ అయిన గంగూలీ రంజీల్లో రాణించి అంతర్జాతీయ వన్డేల్లోకి 1992లో వెస్టిండీస్‌పై అరంగేట్రం చేశాడు.
 
అయితే ఆ మ్యాచ్‌లో దారుణంగా విఫలమై.. తన దూకుడుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆటగాళ్లకు డ్రిం​క్స్‌ అందించనని, అది తన ఉద్యోగం కాదని వాగ్వివాదానికి దిగాడు. దీంతో గంగూలీని జట్టులో నుంచి తీసేశారు. 
 
కానీ దులీప్‌ ట్రోఫీలో చేసిన 175 పరుగులు ఇన్నింగ్స్‌ మళ్లీ దాదాకు అవకాశం కల్పించింది. ఇంగ్లండ్‌ సిరీస్‌కు ఎంపికయ్యేలా చేసింది. ఒకే వన్డేలో అవకాశం వచ్చినప్పటికి గంగూలీ ఆకట్టుకోలేకపోయాడు. కానీ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ-అజారుద్దీన్‌ల మధ్య గొడవ గంగూలీకి టెస్టు మ్యాచ్‌ ఆడే అవకాశం ఇచ్చింది.
 
ఈ గొడవతో సిద్దూ స్వదేశం పయనమవ్వగా.. అతని స్థానంలో గంగూలీ లార్డ్స్‌ టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసి సెంచరీ సాధించాడు. అక్కడి నుంచి ఇక గంగూలీకి తిరుగేలేదు. 1999 ప్రపంచకప్‌లో శ్రీలకంపై 158 బంతుల్లో 183 పరుగులు చేసిన ఇన్నింగ్స్‌ గంగూలీ అభిమానుల మదిలో ఇంకా కదలాడుతోంది. 
 
ఇంకా గంగూలీ అంటేనే అందరికి గుర్తుకొచ్చే సన్నివేశం ఒకటుంది. ఇంగ్లండ్‌తో నాట్‌వెస్ట్‌ సిరీస్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ గెలవడంతో దాదా లార్డ్స్‌ మైదానంలో తన చొక్కావిప్పి గాల్లోకి విసిరేసి ఆనందం వ్యక్తం చేసినదే. సౌరవ్ గంగూలీ నాయకత్వంలోనే భారత్‌ 2003 ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరింది.


ఈ టోర్నీలో గంగూలీ కెప్టెన్‌గానే కాకుండా ఆటగాడిగా మూడు సెంచరీలతో 465 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. టెస్టుల్లో దాదా నాయకత్వంలో భారత్‌ 2001లో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, 2002లో జింబాంబ్వే, వెస్టిండీస్‌ సిరీస్‌లు గెలిచింది. 
 
2005 ఫామ్‌ కోల్పోవడంతో జట్టుకు దూరమయ్యాడు. అప్పటి వైస్‌ కెప్టెన్‌గా ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌కు కెప్టెన్‌గా బీసీసీఐ బాధ్యతలు అప్పగించింది. 
గంగూలీ నాయకత్వంలో సెహ్వాగ్, హర్బజన్, జహీర్, యువరాజ్, కైఫ్,లు అంతార్జాతీయ క్రికెట్లోకి వచ్చారు. ధోని కూడా దాదా కెప్టెన్సీలోనే వచ్చాడు.
 
ఇక గంగూలీ రికార్డుల సంగతికి వస్తే.. 
* ఏ క్రికెట్ భాగస్వామితోనైనా వన్డేల్లో అత్యధిక 8277 పరుగులు సాధించిన క్రికెటర్ గంగూలీ
* ఏ భాగస్వామితోనైనా వన్డేల్లో అత్యధికంగా 26 సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా నిలిచిన దాదా 
* ఓపెనింగ్ పెయిర్‌గా వన్డేల్లో గంగూలీ 21 సెంచరీలు సాధించాడు.
 
* అంతర్జాతీయ క్రికెట్‌లో భాగస్వామి ఎవరైనా సరే లెక్కచేయకుండా 38 శతకాలు సాధించాడు. 
* సచిన్, దాదాల భాగస్వామ్యం 12400 పరుగులను సాధించి.. అంతర్జాతీయ క్రికెట్‌లో 50ప్లస్ యావరేజ్ కొట్టిన రికార్డ్ కూడా గంగూలీ ఖాతాలోనే వుంది. 
 
ఇంకా వరల్డ్ కప్ కెరీర్ సంగతికి వస్తే.. 
1999, 2003, 2007 వరల్డ్ కప్‌ల్లో గంగూలీ 21 మ్యాచ్‌లు ఆడాడు. 1006 పరుగులు సాధించి.. 55.88 యావరేజ్ సాధించాడు. స్ట్రైక్ రేట్‌ 77.50ను కలగివున్నాడు. వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో మూడు అర్థసెంచరీలు, నాలుగు శతకాలు వున్నాయి.