ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్ వరల్డ్ రికార్డ్.. 72 బంతుల్లో 172 రన్స్...

మంగళవారం, 3 జులై 2018 (17:13 IST)

ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్ పరుగుల వరదపారించాడు. మంగళవారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఫించ్ ఏకంగా 172 పరుగుల చేశాడు. ఈ పరుగులు వన్డేల్లోనే.. టెస్టుల్లో చేసినవి కావు.. పొట్టి క్రికెట్ ఫార్మెట్ అయిన ట్వంటీ20లో.
aaron finch
 
జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఫించ్ 72 బంతుల్లో ఏకంగా 172 పరుగులు చేశాడు. టీ-20ల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. గతంలో 156 పరుగులతో తన పేరుతో ఉన్న రికార్డును ఫించ్… మరోసారి తిరగరాశాడు. జింబాబ్వే బౌలింగ్‌ను చీల్చి చెండాడిన ఫించ్.. కేవలం 22 బాల్స్‌లో హాఫ్ సెంచరీ, 50 బాల్స్‌లో సెంచరీ చేశాడు. 
 
ఆ తర్వాత మరింతగా రెచ్చిపోయిన ఫించ్.. 26 బంతుల్లో 72 పరుగులు చేశాడు. మొత్తం ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 10 సిక్స్‌లు కొట్టాడు. ఫించ్ వీరబాదుడుతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 2 వికెట్లకు 229 పరుగులు చేసింది. 
 
అనంతర లక్ష్యఛేదనలో బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 129 రన్స్ మాత్రమే చేసి, ఘోర పరాజయం పాలైంది. దీంతో ఆస్ట్రేలియా 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీనిపై మరింత చదవండి :  
ఆస్ట్రేలియా కెప్టెన్ ట్వంటీ20 Captain Australia Aaron Finch New Record International Score ఆరోన్ ఫించ్

Loading comments ...

క్రికెట్

news

ద్రవిడ్‌కు అరుదైన గౌరవం.. ఐదో భారతీయుడిగా రికార్డు

భారత క్రికెట్‌లో "ది వాల్‌"గా పేరుగడించిన రాహుల్ ద్రవిడ్‌కు అరుదైనగౌరవం దక్కింది. ...

news

కాంబ్లీ భార్యను తాకరాని చోట తాకాడు.. బ్యాగ్‌తో బాదేసింది.. ఎవరు?

మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ భార్య ఆండ్రియా వార్తల్లో నిలిచారు. ఓ మాల్‌లో షాపింగ్‌కు ...

news

మాజీ క్రికెటర్ భార్యపై కేసు.. ఎందుకో తెలుసా?

మాజీ క్రికెటర్ వినోంద్ కాంబ్లీ సతీమణిపై పోలీసు కేసు నమోదైంది. బాలీవుడ్ సింగర్ అంకిత్ ...

news

రాజ్యసభకు హర్యానా హరికేన్‌.. రాష్ట్రపతి కోటాలో...

భారత క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్‌‌ రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. గతంలో మాస్టర్ బ్లాస్టర్ ...