గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 19 జులై 2023 (20:22 IST)

ఆసియా కప్ షెడ్యూల్ ఖరారు : దాయాదుల సమరం ఎపుడంటే?

asia cup
ఆసియా దేశాల మధ్య క్రికెట్ టోర్నీ జరుగనుంది. ఇందులో ఆసియా దేశాలైన భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్, నేపాల్ దేశా మధ్య జరుగనుంది. ఈ జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఏ గ్రూపులో భారత్‌, పాకిస్థాన్‌, నేపాల్‌ ఆడుతుండగా... గ్రూప్‌ బిలో బంగ్లాదేశ్‌, ఆఫ్గానిస్థాన్‌, శ్రీలంక జట్లు ఉన్నాయి. 
 
ఈ టోర్నీ వచ్చే నెల 30వ తేదీ నుంచి ప్రారంభమై 17వ తేదీ వరకు జరుగుంది. ఆరు దేశాలు పాల్గొనే మినీ టోర్నీ కోసం పాకిస్థాన్‌, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పాక్‌లో నాలుగు మ్యాచ్‌లు, శ్రీలంకలో తొమ్మిది మ్యాచ్‌లు లెక్కన హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించేందుకు ఏషియన్‌ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.
asia cup
 
గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లు ఆగస్టు 30 నుంచి మొదలవుతాయి. సూపర్‌ 4 మ్యాచ్‌లు సెప్టెంబరు 6 నుంచి ఉంటాయి. సెప్టెంబరు 17న ఫైనల్‌ మ్యాచ్‌ ఉంటుంది. పాకిస్థాన్‌తో సెప్టెంబరు 2న శ్రీలంకలోని కాండీ స్టేడియంలో, నేపాల్‌తో సెప్టెంబరు 4న భారత్‌ మ్యాచ్‌లు ఆడుతుంది.