Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆస్ట్రేలియాకు చేదు అనుభవం: కిట్ బ్యాగుల్ని మోసుకుని.. వాళ్లే వ్యానుల్లో లోడ్ చేసుకున్నారు..

బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (12:45 IST)

Widgets Magazine

భారత్‌లో మరో పర్యాటక జట్టైన ఆస్ట్రేలియాకు చేదు అనుభవం ఎదురైంది. ముంబై ఎయిర్‌పోర్టులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చినా ఈ ఘటన పెద్ద వివాదానికి దారితీస్తోంది. పర్యాటక జట్టుకు గౌరవించగా పోగా, ఇంత దారుణంగా అవమానిస్తారా? అంటూ ఆస్ట్రేలియన్ మీడియా ప్రశ్నిస్తుందంటే ఈ విషయం ఎక్కడి వరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ విషయంపై ఆసీస్ క్రికెటర్లు బహిరంగంగా స్పందించకపోవడం విశేషం.
 
ఇంతకీ ఏం జరిగిందంటే? నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం భారత్‌లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు విమానాశ్రయం నుంచి బయటికి వచ్చే సమయానికి వారి బ్యాగుల్ని తీసుకెళ్లే వాళ్లెవ్వరూ కనిపించలేదు. మామూలుగా అయితే బోర్డు వారి కోసం ఏర్పాట్లు చేయాలి. కానీ అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లే స్వయంగా వారి పెద్ద పెద్ద కిట్‌ బ్యాగుల్ని మోసుకుని బయటికి తీసుకొచ్చారు. 
 
అంతేకాదు వారి కిట్ బ్యాగులను తీసుకెళ్లే వ్యానులో వాళ్లే లోడ్ చేసుకున్నారు. జట్టు సభ్యుడు వార్నర్‌ ఎక్కి స్మిత్‌ నుంచి కిట్‌ బ్యాగును అందుకుంటున్న చిత్రం సామాజిక మాధ్యమాల్లో హల్‌ చల్‌ చేస్తోంది. దీనిపై ఆస్ట్రేలియా మీడియా గుర్రుగా ఉంది. ఒకప్పుడు బీసీసీఐ అంటే గొప్ప ధనిక బోర్డు.. పర్యాటక జట్టుకు గొప్పగా మర్యాదలు చేసే బోర్డు అని చెప్పుకునేవారు. కానీ ఈ మధ్య బోర్డులో జరుగుతున్న తతంగాలతో దేశం పరువు బజారుకు వచ్చేసింది. 
 
మొన్నటికి మొన్న ఇంగ్లండ్ క్రికెటర్లకు హోటల్ గదులను సర్దుబాటు చేయలేక వారిని పూణెలోనే ఉంచేసిన ఘటన మరువక ముందే, తాజాగా భారత్‌లో మరో పర్యాటక జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. పర్యాటక జట్టు అయిన ఆస్ట్రేలియాను గౌరవించకపోయినా.. ఇంత దారుణంగా అవమానిస్తారా? అంటూ ఆస్ట్రేలియన్ మీడియా ప్రశ్నించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

లిటిల్ట్ మాస్టర్‌తో లిటిల్ ఫ్యాన్.. ఆ తేదీని క్యాలెండర్‌లో మార్కు లేదా సేవ్ చేసుకోండి..

టీమిండియా స్టార్ ప్లేయర్ హర్భజన్ సింగ్ కుమార్తె హినయ హీర్‌తో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ...

news

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. కరుణ్ నాయర్‌కు చోటు.. విరాట్ కోహ్లీ 20వ టెస్టులోనూ రాణిస్తుందా?

విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటివరకు 19 టెస్టుల్లో తన విజయ పరంపరను ...

news

అంధుల క్రికెట్‌పై సెహ్వాగ్ ట్వీట్ వివాదాస్పదం.. రెండు కుక్కలు నరకానికి చేరాయ్..

భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ...

news

ప్రత్యర్థుల గౌరవం పొందుతున్న అరుదైన జట్టు కోహ్లీ టీమ్

భారత క్రికెట్ జట్టుకు ఇది స్వర్ణయుగం అనే చెప్పాలి. ఒక కీలక వికెట్ పడగొడితే చాలు భారత్ ...

Widgets Magazine