1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 28 మార్చి 2015 (12:24 IST)

వరల్డ్ కప్ మహా సంగ్రామం : న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఆటగాళ్ళ కఠోర సాధన!

వరల్డ్ కప్ 2015 మెగా టోర్నీలో భాగంగా ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు కఠోర సాధన చేస్తున్నారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలోని ఎంసీజీ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంల ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. 
మొదటి సారి ఫైనల్‌కు చేరిన న్యూజిలాండ్ తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అలాగే, రికార్డు స్థాయిలో ప్రపంచకప్‌లు సాధించిన జట్టుగా నిలిచేందుకు ఆస్ట్రేలియా తహతహలాడుతోంది. రెండు జట్లు ఎవరికి వారు విజేతలం మేమే అంటూ ప్రకటించేసుకుంటున్నాయి. 
 
ఎంసీజీ పెద్ద గ్రౌండ్ అని, కివీస్ రికార్డు బాలేదు కనుక విజయం తమదేని ఆసీస్ చెపుతోంది. అయితే, క్రికెట్‌లో ఏదీ అసాధ్యం కాదు. జట్టుగా ఆడడమే న్యూజిలాండ్ విజయరహస్యం. ఆసీస్‌ను చిత్తు చేసి తొలి ప్రపంచకప్‌ను సగర్వంగా సాధిస్తామని కివీస్ ఆటగాళ్లు ప్రకటించారు. ఈ ఫైనల్ మ్యాచ్‌పై ఆసక్తి చెలరేగుతోంది. ఫైనల్లో తలపడేందుకు రెండు జట్లు తీవ్రమైన సాధనలో మునిగిపోయాయి.