శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 30 మార్చి 2018 (13:31 IST)

ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి : క్రికెటర్లకు మిక్కీ ఆర్థర్ సలహా

బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సభ్యులపై ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కోచ్ మిక్కీ ఆర్థర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంలో చిక్కుకుని నిషేధానికి గురైన ఆటగాళ్ళ వైఖరిని ఆయ

బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సభ్యులపై ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కోచ్ మిక్కీ ఆర్థర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంలో చిక్కుకుని నిషేధానికి గురైన ఆటగాళ్ళ వైఖరిని ఆయన తప్పుబట్టారు. అలాగే, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని నడుచుకోవాలంటూ హితవు పలికారు. 
 
ఈ వివాదంపై ఆయన స్పందిస్తూ, దేశ ప్రతిష్ఠను మంటగలిపే పనులు చేస్తున్నారనేందుకు ఆసీస్ క్రికెటర్లు చేసిన పనే చక్కని ఉదాహరణ అని అన్నారు. క్రికెట్ సంస్కృతి ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ, ఆసీస్ అహంకారపూరిత ధోరణితో ఉందని ఆయన ఆరోపించారు. 
 
నియంతృత్వపోకడతో ఆసీస్ ఆటగాళ్లు తప్పుమీద తప్పులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రపంచ క్రికెట్ జట్లన్నింటిదీ ఒకదారైతే, ఆసీస్ మాత్రం మరొక దారిలో నడుస్తూ దోషిగా నిలబడిందన్నారు. ఇప్పటికైనా ఆసీస్ బుద్ధి తెచ్చుకుని తీరు మార్చుకోవాలని మిక్కీ ఆర్థర్ సూచించారు.