సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 మార్చి 2022 (15:31 IST)

మహిళల వన్డే ప్రపంచ కప్ 2022.. పాక్ అవుట్.. బంగ్లాదేశ్ విన్

Bangladesh
హామిల్టన్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన లీగ్‌​ మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ విజయం సాధించింది.  దీంతో మహిళల వన్డే ప్రపంచ కప్ 2022లో బంగ్లాదేశ్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. 
 
పాకిస్తాన్‌ ఈ మెగా టోర్నమెంట్‌లో వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. 235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 225 పరుగులు మాత్రమే చేయగలిగింది. 
 
పాకిస్తాన్‌ బ్యాటర్లలో సిద్రా అమీన్ ఆద్భుతమైన సెంచరీ సాధించనప్పటికీ ఫలితం లేక పోయింది. మిడిలార్డర్‌ బ్యాటర్లు విఫలం కావడంతో పాక్‌కు ఓటమి తప్పలేదు.
 
ఇక బంగ్లాదేశ్‌ బౌలర్లలో ఫాహిమా ఖాటాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. రుమానా అహ్మద్ రెండు, ఆలాం ఒక్క వికెట్‌ సాధించారు. అంతకుమందు బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 7 వికెట్లు నష్టానికి 234 పరుగులు చేసింది.