గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 అక్టోబరు 2021 (15:06 IST)

ట్వంటీ20 ప్రపంచ కప్ : టీమిండియాకు కొత్త జెర్సీ

ఈ నెల 24వ తేదీ నుంచి ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీలు దుబాయ్ వేదికగా జరుగనున్నాయి. ఈ వేడుకల్లో భారత క్రికెట్ జట్టు పాల్గొంటుంది. అయితే, ఈ టోర్నీకి వెళ్లే టీమిండియా కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కొత్త జెర్సీలను బుధవారం ఆవిష్కరించింది. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో కోహ్లీసేన ఈ కొత్త జెర్సీలోనే క‌నిపించ‌నుంది. 
 
'బిలియ‌న్ చీర్స్ జెర్సీ' అన్న నినాదంతో కొత్త దుస్తుల్ని రిలీజ్ చేశారు. క్రికెట్ అభిమానుల చీర్స్ ప్రేర‌ణ‌తో జెర్సీల‌ను రూపొందించిన‌ట్లు బీసీసీఐ త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించింది. టీమిండియా జ‌ట్టుకు కిట్‌ స్పాన్స‌ర్‌గా ఎంపీఎల్ స్పోర్ట్స్‌ వ్య‌వ‌హ‌రిస్తోంది. 
 
ఈ జెర్సీలు కావాల‌నుకున్న‌వారు ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేయ‌వ‌చ్చు. అక్టోబ‌ర్ 24వ తేదీ నుంచి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ప్రారంభంకానున్న విష‌యం తెలిసిందే. భారత్ తన ప్రారంభ మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది.