శుక్రవారం, 3 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (12:15 IST)

రాజ్‌కోట్‌ టెస్టు.. 100 టెస్టుల క్లబ్‌లో బెన్ స్టోక్స్.. అతనిని అవుట్ చేయాలని?

గురువారం రాజ్‌కోట్‌లో భారత్‌తో జరుగనున్న టెస్టు ద్వారా 100 టెస్టులు ఆడిన 16వ ఇంగ్లండ్ క్రికెటర్‌గా స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అవతరించాడు. 32 ఏళ్ల ఇంగ్లండ్ కెప్టెన్ ప్రస్తుత అంతర్జాతీయ ఆటగాళ్ళు జేమ్స్ ఆండర్సన్, జో రూట్‌లతో సహా ఎలైట్ క్లబ్‌లో చేరతాడు.  
 
మరోవైపు గురువారం నుంచి రాజ్‌కోట్‌లో భారత్‌తో ప్రారంభమయ్యే మూడో టెస్టు మ్యాచ్‌లో ఫామ్‌లో ఉన్న యువ ఆటగాడిని ఔట్ చేయడానికి బెన్ స్టోక్స్ సిద్ధమవుతున్నాడని మాజీ ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కోచ్ డేవిడ్ లాయిడ్ అభిప్రాయపడ్డాడు. 
 
ఇకపోతే టీమిండియా స్టార్ ప్లేయల్ జైస్వాల్ విశాఖపట్నంలో చారిత్రాత్మక డబుల్ సెంచరీతో మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లలో అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు. జైస్వాల్ బ్యాటింగ్ విషయానికి వస్తే స్పష్టమైన బలహీనత ఏమీ లేనప్పటికీ, ఇంగ్లండ్ ఆఫ్-స్పిన్నర్‌తో లెఫ్ట్ హ్యాండర్‌ను లక్ష్యంగా చేసుకుని, క్యాచ్ కోసం ఫీల్డర్‌కు వెళ్లే భారీ షాట్‌కు వెళ్లమని అతనిని ప్రలోభపెట్టాలని లాయిడ్ అభిప్రాయపడ్డాడు.