శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 మే 2021 (21:48 IST)

ఆల్‌టైమ్ ఐపీఎల్ ఎలెవన్‌లో ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మలకు చోటు

పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్, రాయస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ తన ఆల్‌టైమ్ ఐపీఎల్ ఎలెవన్‌ను ప్రకటించాడు. తన జట్టులో భారత్ నుంచి ధోనీ, కోహ్లీ, శర్మలకు చోటు కల్పించాడు. సురేశ్ రైనా, గేల్‌, శిఖర్ దావన్, డేవిడ్ వార్నర్‌లను ఎంపిక చేయలేదు.
 
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బట్లర్‌.. ఐపీఎల్‌లో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని సృష్టించుకున్నాడు. ఐపీఎల్ పోటీలను సస్పెండ్ చేసిన తర్వాత బట్లర్ క్రిక్‌బజ్ ప్లస్‌తో ముచ్చటిస్తూ తన ఆల్ టైమ్ ఐపీఎల్ ఎలెవన్‌ను వెల్లడించాడు.
 
రోహిత్ తో కలిసి తనను ఓపెనర్‌గా పేర్కొన్న బట్లర్‌.. మిగిలిన బ్యాటింగ్ లైనప్‌లో కోహ్లీ, ధోనీలను తీసుకున్నారు. ఇద్దరు ఆల్ రౌండర్లుగా రవీంద్ర జడేజా, కీరోన్ పొలార్డ్ పేర్లను తీసుకున్నారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే హర్బజన్‌సింగ్‌, భువి, బుమ్రా, మలింగలకు చోటు కల్పించారు.
 
జోస్ బట్లర్ ఆల్ టైమ్ ఐపీఎల్ ఎలెవన్: జోస్ బట్లర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్‌), కీరోన్ పొలార్డ్, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ.