గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (18:03 IST)

ఉల్లి, ఆలు వస్తూ పోతూ వుంటే.. ఇండో-పాక్ మ్యాచ్‌లు ఎందుకు జరగకూడదు..?

ఇండో-పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించాలని పాకిస్తాన్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తెలిపాడు. దాయాది దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు ఆపేయడం సరికాదని, అన్ని ఆటల్లో లేనిది క్రికెట్‌లో ఎందుకు వుండాలని ప్రశ్నించాడు. ఉల్లిపాయలు, ఆలు గడ్డలు ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్న తరుణంలో క్రికెట్ మాత్రం ఎందుకు ఆడకూడదని ప్రశ్నించారు. 
 
అయితే తాను ఎవరినీ తప్పుపట్టడం లేదని, ఇరు దేశాల మధ్య మ్యాచ్‌లు జరగడం క్రికెట్‌కు మంచిదని వ్యాఖ్యానించారు. భారత క్రికెటర్లు పాకిస్థాన్‌కు, పాక్ క్రికెటర్లు భారత్‌కు వచ్చే పరిస్థితి లేకపోయినా విదేశాల్లో తటస్థ వేదికలపై మ్యాచ్‌లు నిర్వహించవచ్చు కదా అని అక్తర్ ప్రశ్నించారు. 
 
త్వరలోనే ఇండియా-పాక్ మ్యాచ్‌లు జరుగుతాయని ఆశిస్తున్నానని తెలిపారు. ఇటీవలే వెటరన్ క్రికెటర్లు యువరాజ్ సింగ్, షాషిద్ అఫ్రీదీ కూడా ఇలాంటి అభిప్రాయమే వెలిబుచ్చిన సంగతి తెలిసిందే.