Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చాంపియన్స్ ట్రోఫీ : ఇంగ్లండ్‌ హ్యాట్రిక్‌ విక్టరీ... ఆస్ట్రేలియా అవుట్‌

ఆదివారం, 11 జూన్ 2017 (12:08 IST)

Widgets Magazine

చాంపియన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్ హ్యట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫలితంగా సెమీస్‌కు బంగ్లాదేశ్‌ చేరింది. శనివారం జరిగిన గ్రూప్‌-ఏ ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 40 పరుగులతో ఆస్ట్రేలియాను ఓడించింది. కంగారు జట్లు నిర్దేశించిన 278 పరుగుల లక్ష్య ఛేదనలో ఆతిథ్య జట్టు 40.2 ఓవర్లలో 204/4 స్కోరుతో గెలుపు ముంగిట నిలిచిన సమయంలో వర్షం కారణంగా ఆట ఆగిపోయింది. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు 9 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. పలువురు ఆటగాళ్లు రాణించినప్పటికీ, ఎవరూ భారీ స్కోరు చేయలేకపోవడం ఆ జట్టుకు శాపమైంది. ఫించ్‌ 68, స్మిత్‌ 56, ట్రావిస్‌ హెడ్‌ 71 పరుగులు చేశారు. ఆపై 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు ఆదిలోనే తడబడింది. 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో తొలిసారి ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. ఆపై ఆట తిరిగి ప్రారంభమైన తర్వాత మోర్గాన్‌, స్టోక్స్‌ విరుచుకుపడటంతో, 20 ఓవర్లకే 126 పరుగులు సాధించి, వర్షం పడ్డా గెలిచేందుకు కావాల్సిన పరుగులను సాధించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

చాంపియన్స్ ట్రోఫీ : భారత్‌కు చావో రేవో.. గెలిస్తేనే సెమీస్‌కు.. మ్యాచ్ రద్దు అయితే?

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్, దక్షిణాఫ్రికా జట్ల ...

news

ఆ మహిళతో సెల్ఫీ దిగితే గోల్డెన్ డకౌట్ కావాల్సిందే.. జట్టూ ఓడిపోవాల్సిందే.. ఎవరామె?

జైనాబ్ అబ్బాస్. ఈ పేరు ఇపుడు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఇంతకీ ఈమె ఎవరన్నదే కదా మీ ...

news

చాంపియన్స్ ట్రోఫీ : న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించిన బంగ్లాదేశ్

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నుంచి న్యూజిలాండ్ జట్టు ...

news

కెప్టెన్‌ కోహ్లి చెప్పాడని కుంబ్లేను మారిస్తే బోర్డు గతేమిటి? కోచ్‌ మార్పుపై సందిగ్ధంలో బీసీసీఐ

భారత క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్ కూడా చేయలేని సాహసానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ...

Widgets Magazine