శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 7 జూన్ 2019 (14:07 IST)

స్నేహితురాలితో అలా నడుస్తూ వెళ్తుంటే.. క్రికెటర్‌ను కత్తులతో దాడి చేసి చంపేశారు..

స్నేహితురాలితో రోడ్డుపై నడిచి వెళ్ళిన క్రికెటర్ దారుణంగా హత్యకు గురయ్యాడు. ముంబైలో జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన రాకేష్.. ఓ క్రికెటర్. ఇతడు తన ప్రాంతానికి చెందిన క్రికెటర్లకు కోచ్‌గానూ సలహాలిస్తుండటం చేస్తుంటాడు. 
 
ఈ నేపథ్యంలో గురువారం స్నేహితురాలితో కలిసి బందప్ ప్రాంతానికి వెళ్తుండగా.. అతనిని అడ్డుకున్న ముగ్గురితో కూడిన బృందం రాకేశ్‌పై కత్తులతో దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన రాకేష్.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం మహారాష్ట్ర క్రికెట్ టీమ్‌లో ఉన్న రాకేశ్, రంజీ జట్టులో చోటు దక్కించుకునేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. గురువారం రాత్రి బందప్ ప్రాంతంలో అతనిపై దాడి జరిగింది. సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామని, దాడి చేసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.