శుక్రవారం, 3 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 21 జులై 2024 (16:05 IST)

బాలీవుడ్ హీరోయిన్లతో రిలేషన్‌లో ఉంటేనే భారత క్రికెట్ జట్టులో చోటు : ఎస్. భద్రీనాథ్

sbhadrinath
బాలీవుడ్ హీరోయిన్లతో రిలేషన్‌లో ఉంటేనే భారత క్రికెట్ జట్టులో చోటు దక్కుతుందా అంటూ మాజీ క్రికెటర్ ఎస్.భద్రీనాథ్ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. ఇటీవల జరిగిన టీ20తో పాటు ఈ నెలాఖరు నుంచి ప్రారంభంకానున్న శ్రీలంక పర్యటనల కోసం ఎంపిక చేసిన భారత జట్టులో పలువురు ప్రతిభావంతులైన ఆటగాళ్లను చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేయలేదు. దీనిపై మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి వారిలో రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మలు ఉన్నారు. ఇలాంటి యువ క్రికెటర్లకు జట్టులో చోటు కల్పించకపోవడంతో అనేక మంది మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
దీనిపై మాజీ క్రికెటర్ ఎస్.భద్రీనాథ్ ఒకింత ఘాటుగా స్పందించారు. శ్రీలంక టూర్‌కు రుతురాజ్‌ను ఎంపిక చేయకపోవడం షాకిచ్చింది. జట్టులోకి ఎంపిక కావడానికి ట్యాలెంట్ కంటే బ్యాడ్ బాయ్ ఇమేజ్ ఎంతో అవసరమని ఒక్కోసారి అనిపిస్తుంది. భారత క్రికెట్ జట్టు తరపున ఆడాలంటే బాలీవుడ్ హీరోయిన్లతో రిలేషన్‌షిప్‌లో ఉండాలేమో... ఒళ్ళంతా టాటూలు వేయించుకోవాలేమో లేదా మంచి మీడియా మేనేజరును కలిగివుండాలేమో అంటూ బద్రీనాథ్ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.