భారత క్రికెటర్లకు డోప్ టెస్టులు : వాడా డిమాండ్

ఆదివారం, 29 అక్టోబరు 2017 (09:05 IST)

bcci

భారత క్రికెటర్లకు కూడా డోప్ పరీక్షలు నిర్వహించాలని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) డిమాండ్ చేస్తోంది. దీంతో బీసీసీఐకు కొత్త చిక్కు వచ్చిపడింది. ఇప్పటికే ఐసీసీతో చర్చలు జరిపిన వాడా.. కొన్ని ప్రత్యేక సూచనలు చేసింది. 
 
బీసీసీఐ అనుమతితో జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ ద్వారా భారత క్రికెటర్లకు డోపింగ్‌ పరీక్ష నిర్వహించాలని సూచించింది. ఒకవేళ బీసీసీఐ ఇందుకు ఒప్పుకోకపోతే నాడా గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. వాడా అక్రిడేషన్‌ పొందిన నాడా గుర్తింపు రద్దు అయితే భారత క్రీడాకారులు ఎవరూ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశమే ఉండదు. 
 
దీనిపై ఇప్పటికే వాడా కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌కు లేఖ రాసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి బీసీసీఐకి లేఖ రాయాలని రాథోడ్‌ కేంద్ర క్రీడలశాఖ కార్యదర్శి శ్రీనివాస్‌కు ఆదేశాలు జారీ చేశారు. నాడాతో బీసీసీఐ కలిసి పని చేయాల్సిందిగా కోరుతూ లేఖ రాశారు. దీనిపై మరింత చదవండి :  
Wada Bcci Dope Test Indian Cricketer Anti-dope Test

Loading comments ...

క్రికెట్

news

భారత ఆటగాళ్ళలో ధోనీ ఏడోవాడు...

భారత ఆటగాళ్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఏడోవాడుగా రికార్డు పుటలకెక్కాడు. తాజాగా, భారత్ ‌- ...

news

జాతీయ గీతం కోసం 52 సెకన్ల నిలబడలేమా? గంభీర్ ట్వీట్

దేశభక్తిని, జాతీయ భావాన్ని పెంపొందించడానికి వీలుగా సినిమా మొదలయ్యే ముందు జాతీయ గీతాన్ని ...

news

పేపరూపెన్నూ ఉందని నిరాధారపూరిత వార్తలు రాయొద్దు : ద్రవిడ్

వచ్చే డిసెంబర్‌లో త‌న‌కు విశ్రాంతి కావాల‌ని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ...

news

క్రికెట్ ఆడితే కాల్చి చంపేస్తామన్నారు.. అన్నయ్యలపై సోదరి ఫిర్యాదు

క్రికెట్ ఆడితే కాల్చేస్తామని బెదిరించిన అన్నయ్యలపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు ...