శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 23 ఏప్రియల్ 2015 (11:36 IST)

క్రీడాకారులతో జీవితం పంచుకోవాలనే అమ్మాయిలకు కష్టాలే: స్టెయిన్

క్రీడాకారులతో జీవితం పంచుకోవాలనే అమ్మాయిలకు లేదా అబ్బాయిలకు కష్టాలు తప్పవని సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ అన్నాడు. క్రీడాకారులతో జీవితం పంచుకునే అమ్మాయులకు లేదా అబ్బాయిలకు ఎవరికైనా ఇబ్బందులు తప్పవని చెప్పాడు. ఎక్కువ శాతం ఇంటికి దూరంగా గడుపుతుంటామని చెప్పాడు.

ఎప్పుడు వెళ్తామో, ఎప్పుడు వస్తామో తెలియదని చెప్పాడు. ఎప్పుడూ ప్రయాణాలే ఉంటాయని అన్నాడు. గతంలో తన ప్రియురాలు ఎప్పుడూ తన వెంటే ఉండేదన్నాడు. తన వెంట ఎప్పుడూ తన వాళ్లను తీసుకు వచ్చుకుంటానని చెప్పారు. 
 
అదే సమయంలో విజయవంతమైన రిలేషన్ షిప్ కోసం డెల్ స్టెయిన్ కొన్ని సూచనలు చేశాడు. ఇరువురి అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ.. చివరకు ఇరువురు ప్యారలల్‌గా ఉండటమే మంచి రిలేషన్‌షిప్ అన్నారు. కాగా, సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో కోల్‌కతా నైట్ రైడర్స్ 16 పరుగుల తేడాతో బుధవారం ఓటమి పాలైన సంగతి తెలిసిందే. డక్ వర్త్ లూయిస్ ప్రకారం 12 ఓవర్లలో 118 పరుగులు చేయాల్సి ఉండగా కోల్‌కతా నాలుగు వికెట్ల నష్టానికి 101 పరుగులు మాత్రమే చేసింది.