శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 జులై 2018 (16:27 IST)

ప్రపంచ కప్ తర్వాత విశ్రాంతి : డేల్ స్టెయిన్

అంతర్జాతీయ క్రికెట్ నుంచి మరో క్రికెటర్ తప్పుకోనున్నారు. ఆ క్రికెటర్ పేరు డేల్ స్టెయిన్. ఫాస్ట్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తించిన దక్షిణాఫ్రికా స్పీడ్‌గన్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌కు 2019 వరల్డ్‌ క

అంతర్జాతీయ క్రికెట్ నుంచి మరో క్రికెటర్ తప్పుకోనున్నారు. ఆ క్రికెటర్ పేరు డేల్ స్టెయిన్. ఫాస్ట్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తించిన దక్షిణాఫ్రికా స్పీడ్‌గన్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌కు 2019 వరల్డ్‌ కప్‌ తర్వాత రిటైర్మెంట్‌ ప్రకటిస్తానని ప్రకటించాడు.
 
ఇదే అంశంపై స్టెయిన్ మాట్లాడుతూ, మైదానంలో ప్రతీసారి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నా అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. 2019 వరల్డ్‌ కప్‌కు సెలెక్ట్ అవుతాను అని ఆశాభావం వ్యక్తం చేశారు. వరల్డ్‌ కప్‌ తర్వాత వన్డేల నుండి తప్పుకున్నా.. సాధ్యమైనన్ని రోజులు టెస్టు క్రికెట్‌లో కొనసాగుతానని ఆశాభావం వ్యక్తంచేశాడు. 
 
ప్రస్తుతం గాయాల నుంచి కోలుకుని పూర్తి ఫిట్నెస్‌ సాధించినట్టు చెప్పారు. ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల్లోనూ ఆడాను.. మంచి ప్రదర్శనే ఇచ్చానని అనుకుంటున్నా అని తెలిపారు. ఈ సిరీస్‌లో ఎలాంటి గాయాల బారినపడుకుండా ఉన్నందుకు సంతోషిస్తున్నాను.