జట్టు ఎంపిక బాధ్యత కోహ్లీది కాదు. భేటీలో కూర్చుంటాడంతే. నిర్ణయించేది మేమే అన్న ఎంఎస్‌కే
టీమిండియా జట్టు ఎంపిక బాధ్యత కెప్టన్‌ది కాదని జట్టులో ఎవరుండాలనేది నిర్ణయించేది బీసీసీఐ సెలెక్షన్ కమిటీదేనంటూ జాతీయ క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ తేల్చి చెప్పారు. అప్పుడు ధోని... ఇప్పుడు కోహ్లి జట్టును ఎంపిక చేసుకుంటున్నారని అ
టీమిండియా జట్టు ఎంపిక బాధ్యత కెప్టన్‌ది కాదని జట్టులో ఎవరుండాలనేది నిర్ణయించేది బీసీసీఐ సెలెక్షన్ కమిటీదేనంటూ జాతీయ క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ తేల్చి చెప్పారు. అప్పుడు ధోని... ఇప్పుడు కోహ్లి జట్టును ఎంపిక చేసుకుంటున్నారని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వారు కెప్టెన్ హోదాలో సమావేశంలో కూర్చుంటారు కానీ తుది నిర్ణయం మాదే అనేశారు.
ఇప్పటికే 35 ఏళ్ల వయస్సు దాటిన టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ ఇద్దరూ 2019 ప్రపంచ కప్ జట్టులో కూడా ఉంటారా అనే విషయంలో బీసీసీఐ ఇంకా చర్చించలేదని మున్ముందు ఏ నిర్ణయం తీసుకుంటామన్నది వేచి చూడాల్సిందేనని ఎమ్ఎస్‌కే ప్రసాద్ చెప్పారు. జట్టులో వారి స్థానాలపై అవగాహనకు రావాల్సి ఉంది. అయితే ఎప్పుడు ఎలాంటి చర్య తీసుకోవాలో మాకు తెలుసు. హఠాత్తుగా తీసుకోవాల్సిందేమీ లేదు. పూర్తి సమతూకంతో జట్టును రూపొందించాల్సి ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి వ్యవహరిస్తాం అన్నారు
రెండేళ్లలోపే వన్డే ప్రపంచకప్ రాబోతోంది కాబట్టి ఇప్పటి నుంచే దీనికి తగిన ప్రణాళికలను ప్రారంభించామని ప్రసాద్ స్పష్టం చేసారు.ఇటీవలి చాంపియన్స్ ట్రోఫీ మాకు అనేక విధాలుగా తోడ్పడింది. మా అసలు బలమేమిటో తెలిసి వచ్చింది. వాస్తవంగా భారత జట్టు అద్భుతంగా ఆడింది. మేం గుర్తించిన కొన్ని లోపాలను వచ్చే 20 నెలల్లో సరిచేసి ప్రపంచకప్‌కు సిద్ధమవుతాం. ప్రతీ బెర్త్‌పై మాకు స్పష్టత ఉంది. మా ఆలోచనల్లో ఉన్న ఆటగాళ్లకు మరింత అనుభవం కోసం ఎక్కువ అవకాశాలను కల్పిస్తామన్నారు.
గతంలో టీమిండియా ఆటగాళ్లు తమ గాయాల గురించి దాచి పెట్టేవారని, 2000స సంవత్సరంలో ఆసీస్ పర్యటన తర్వాత గాయం కారణంగా తాను కూడా ఆటకు దూరమై ఎనిమిది నెలలపాటు విశ్రాంతి తీసుకున్నాను కానీ నా గాయం తీవ్రత, చికిత్స వివరాలను బీసీసీఐకే కాకుండా నా కార్యదర్శికి కూడా చెప్పలేదని కారణం అప్పట్లో ఆటగాళ్లకు వచ్చే డబ్బు తక్కువగానే ఉండేదని ప్రసాద్ చెప్పారు. ఇప్పుడు ఆటలో విపరీతంగా డబ్బు ప్రవహించడం, కాంట్రాక్ట్ పద్ధతి వారికి లాభించడం, ఐపీఎల్ ద్వారా ఆర్థిక రక్షణ ఏర్పడటం వండి కారణాలతో ఖచ్చితందా ఆడాల్సిన పరిస్థితి లేదు కాబట్టి ఆటగాళ్లు తమ గాయాల గురించి నిజాయితీగా వెల్లడించారని, ఈ నేపథ్యంలోనే భారత్ గత పదేళ్ళు నుంచి నిలకడగా విజయాలు సాధి్స్తోందని ప్రసాద్ వివరించారు .
మొత్తానికి ధోనీ, యువరాజ్‌లపై ఖచ్చితమైన అవగాహన అంటూ లేదని ప్రసాద్ చెప్పడం ద్వారా వారిని 2019 వన్డే ప్రపంచ కప్‌లో ఆడించేది డౌటే అనిపిస్తోంది.