Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దశాబ్దన్నర కాలంగా అజిత్ అగార్కర్ రికార్డు పదిలం... ఏంటది?

ఆదివారం, 1 అక్టోబరు 2017 (14:37 IST)

Widgets Magazine
Ajit Agarkar

అజిత్ అగార్కర్. భారత మాజీ క్రికెటర్. ఇతగాడి పేరిట ఉన్న రికార్డు దశాబ్దన్నరకాలంగా పదిలంగా ఉంది. ఆ రికార్డు ఎంటో తెలుసా? అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో అత్యంత వేగంగా అర్థశతకం నమోదు చేయడం. 
 
సాధారణంగా ఇలాంటి రికార్డుల విషయానికి వస్తే తొలుత మదిలోకి వచ్చే పేర్లు... యువరాజ్‌ సింగ్‌, ఏబీ డివిలియర్స్‌, అఫ్రిది, వార్నర్‌ వంటి కొంతమంది పేర్లు. 2015లో జోహన్నస్‌బర్గ్‌లో శ్రీలంకతో జరిగిన వన్డేలో డివిలియర్స్‌ విధ్వంసర బ్యాటింగ్‌తో 59 బంతుల్లో 149 పరుగులు చేశాడు. ఈ మ్యాచులోనే 16 బంతుల్లోనే అర్థశతకం సాధించి వన్డే క్రికెట్‌ చరిత్రలో అత్యంత వేగమైన హాఫ్‌ సెంచరీ నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో డివిలియర్స్‌ అగ్రస్థానంలో నిలిచాడు. 
 
అదే భారత్‌ తరపున వన్డేల్లో వేగవంతమైన అర్థశతకం నమోదు చేసింది ఎవరో తెలుసా? ఆ ఆటగాడు ఎవరో కాదు అజిత్ అగార్కర్. డిసెంబరు 14, 2000 పర్యాటక జట్టు జింబాబ్వేపై. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా డిసెంబరు 14న భారత్‌ - జింబాబ్వే మధ్య చివరి వన్డే రాజ్‌కోట్‌లో జరిగింది. టాస్‌ గెలిచిన జింబాబ్వే జట్టు భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. హేమంగ్‌ బదానీ ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన అగార్కర్‌ జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 
 
దూకుడుగా ఆడుతూ 21 బంతుల్లోనే అర్థశతకం నమోదు చేశాడు. భారత్‌ తరపున ఇప్పటివరకు నమోదైన వేగవంతమైన అర్థశతకం ఇదే. సెహ్వాగ్‌, కైఫ్‌, యువరాజ్‌, రైనా, ధోనీ, కోహ్లీ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు సైతం 17 ఏళ్ల కిందటి రికార్డును అందుకోలేకపోవడం విశేషం. 1998లో టెస్టుల్లో, వన్డేల్లో అరంగ్రేటం చేసిన అగార్కర్‌ 2006లో టెస్టులకు, 2007లో వన్డేలకు వీడ్కోలు ప్రకటించాడు. 
 
26 టెస్టుల్లో 58 వికెట్లు తీసుకోగా 191 వన్డేల్లో 288 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. పరుగుల మెషిన్‌గా పిలిపించుకుంటోన్న కోహ్లీ, దూకుడుగా ఆడుతోన్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య లేదా ఇంకా ఎవరు ఈ రికార్డును ఎప్పుటికి అధిగమిస్తారో వేచి చూద్దాం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

బీసీసీఐ చర్యతో బోలెడంత నష్టం వాటిల్లింది.. పీసీబీ గగ్గోలు

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అనుసరిస్తున్న వైఖరి వల్ల తమకు బోలెడంత నష్టం ...

news

నేడు చివరి వన్డే.. హోరాహోరీనే... గెలిస్తేనే కోహ్లీసేన నంబర్ వన్

స్వదేశంలో పర్యాటక ఆస్ట్రేలియాతో జరుగుతన్న ఐదు వన్డేల సిరీస్ చివరి అంకానికి చేరుకుంది. ...

news

భారత క్రికెట్‌లో రాజకీయాలెక్కువ.. ప్రేమలో మూడుసార్లు ఫెయిలయ్యా : మిథాలీ రాజ్

భారత క్రికెట్‌పై మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ...

news

స్వదేశంలో కాదు.. విదేశీ గడ్డపై విజయాలు సాధించాలి : విరాట్ కోహ్లీ

స్వదేశంలో విజయాల పరంపర కొనసాగించడం ముఖ్యంకాదనీ, విదేశీ గడ్డపై విజయాలు సాధించాలని భారత ...

Widgets Magazine