Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చాంపియన్స్ ట్రోఫీ : మనీష్ పాండేను తొలగించారు.. దినేష్ కార్తీక్‌ను చేర్చారు.. ఎందుకు?

శుక్రవారం, 19 మే 2017 (11:28 IST)

Widgets Magazine
manish panday

ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ (సీటీ)కి ఎంపికైన ఆనందం యువ బ్యాట్స్‌మన్ మనీష్‌ పాండేకు ఎంతో సమయం నిలువలేదు. గాయం కారణంగా అతను ఈ మెగాటోర్నీ నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో 15 మందితో కూడిన భారత జట్టులో దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేసినట్టు బీసీసీఐ గురువారం ప్రకటించింది. 
 
ఐపీఎల్‌లో కోల్‌కతా తరపున ఆడిన మనీష్‌ సన్ రైజర్స్‌తో ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌ సమయంలో పక్కటెముకల్లో నొప్పితో ఇబ్బంది పడ్డాడు. గాయం పెద్దది కావడంతో అతను సీటీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. పాండే భారత తరపు చివరగా ఈ ఏడాది జనవరిలో ఇంగ్లండ్‌తో రెండో టీ-20లో పాల్గొన్నాడు.
 
అయితే, గాయం కారణంగా మనీష్ పాండేను తొలగించి... తమిళనాడు వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్‌కు చోటు కల్పించారు. ఐపీఎల్‌-10లో గుజరాత్ లయన్స్ తరపున అతను 14 మ్యచ్‌ల్లో 361 పరుగులతో సత్తాచాటాడు. అంతకుముందు విజయ్‌ హజారే ట్రోఫీ, దేవ్‌ధర్‌ ట్రోఫీ ఫైనల్స్‌లో సెంచరీలు చేసి మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. దేశవాళీ సీజన్‌లో నిలకడగా రాణిస్తున్న దినేశను సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా, తొలి మ్యాచ్‌ని జూన్ 4న పాకిస్థాన్‌తో ఆడాల్సి వుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

గుండెపగిలిన సన్ రైజర్స్.. ఐపీఎల్ నుంచి ఔట్.. వర్షం నేపథ్యంలో లక్ష్యాన్ని ఛేదించిన గంభీర్ సేన

ప్రకృతి వైపరీత్యం ఎదురైతే ఎంత మంచి జట్టయినా బరిలోంచి ఎలా తప్పుకోవలిసి వస్తుందో సన్ ...

news

అబ్బా.. ఆస్ట్రేలియా పర్యటనే అత్యంత కఠినమైనది: సచిన్ టెండూల్కర్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన సుదీర్ఘమైన క్రికెట్ కెరీర్లో 1999లో ఆడిన ...

news

ఐపీఎల్ 2017 : ముంబై చిత్తు.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఫైనల్‌కు పూణె

ఐపీఎల్‌ పదో సీజన్‌ క్వాలిఫయర్‌-1 పోరులో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ...

news

ఐపీఎల్‌లో ధోనీ రికార్డు.. ఫిక్సింగ్‌లో జట్టు బహిష్కరణకు గురైనా? ఏడుసార్లు ఫైనల్‌లో?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ...

Widgets Magazine