ఆదివారం, 5 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 సెప్టెంబరు 2022 (13:17 IST)

హైదరాబాద్ వచ్చిన భారత క్రికెటర్లకు రామ్ చరణ్ పసందైన విందు (వీడియో)

ram charan
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో ట్వంటీ-20 మ్యాచ్ ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపును నమోదు చేసుకుంది. హైదరాబాద్‌కు విచ్చేసిన భారత క్రికెటర్లను రామ్‌చరణ్ ఈ సందర్భంగా తన ఇంటికి రావాలని ఆహ్వానించారు. 
 
దీంతో మ్యాచ్ ముగిసిన అనంతరం హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ సహా పలువురు ఆటగాళ్లు రామ్ చరణ్ నివాసానికి వెళ్లారు. అక్కడ వారికి చరణ్ ప్రత్యేక విందు ఆతిథ్యాన్ని ఇచ్చారు. 
 
క్రికెటర్లను సన్మానించి వారితో ముచ్చటించారు. చిరంజీవి కుటుంబ సభ్యులతో పాటు, పలువురు సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలుస్తోంది.