మంగళవారం, 28 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 10 సెప్టెంబరు 2017 (13:30 IST)

పరిణీతి చోప్రాతో మాట్లాడింది కూడా లేదు.. షాకైన హార్దిక్ పాండ్యా

క్రికెటర్ హార్దిక్‌ పాండ్యా-పరిణీతి చోప్రా మధ్య లవ్‌ ఎఫైర్‌ నడుస్తోందంటూ గత కొంతకాలంగా గాసిప్స్‌ విన్పిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, నిన్న మొన్నటిదాకా ఈ గాసిప్స్‌ని ఎంజాయ్‌ చేసిన పరిణీతి చోప్రా, తాజ

క్రికెటర్ హార్దిక్‌ పాండ్యా-పరిణీతి చోప్రా మధ్య లవ్‌ ఎఫైర్‌ నడుస్తోందంటూ గత కొంతకాలంగా గాసిప్స్‌ విన్పిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, నిన్న మొన్నటిదాకా ఈ గాసిప్స్‌ని ఎంజాయ్‌ చేసిన పరిణీతి చోప్రా, తాజాగా హార్దిక్‌ పాండ్యాతో ఎఫైర్‌ అంటూ వస్తోన్న వార్తల్ని ఖండించి పారేసింది. దాంతో, హార్దిక్‌ పాండ్యా షాక్‌కి గురయ్యాడట. 
 
అనవసరంగా చేసిన ట్వీట్‌తోభారత క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా ఇరుక్కున్నాడు. ఇటీవల బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా పెట్టిన ట్వీట్‌కు పాండ్యా కామెంట్‌ పెట్టడంతో నెటిజన్లు పాండ్యాను ఆటపై దృష్టి పెట్టు అంటూ తిట్టిపోశారు. అప్పటినుంచి పరిణీతి, పాండ్యా ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే పరిణీతి క్లారిటీ ఇచ్చింది. తాజాగా పాండ్యా దీనిపై ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. 
 
అసలు పరిణీతి చోప్రా గురించి సరిగ్గా తెలీదని చెప్తున్నాడు. అసలు ఈ విషయంలో ఏం జరిగిందో కూడా తనకు తెలీదన్నాడు. తాను శ్రీలంకలో ఉన్నప్పుడు ఈ ట్వీట్‌ గొడవ జరిగింది. తనకు ఎవరితో ఎఫైర్లు అంటగట్టినా పట్టించుకోననని చెప్పుకొచ్చాడు. అసలు పరిణీతి గురించే సరిగ్గా తెలీదు. ఆమెతో సరిగ్గా మాట్లాడింది కూడా లేదని అన్నాడు.