గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 25 మార్చి 2017 (18:48 IST)

ధర్మశాల మ్యాచ్: 300 పరుగుల వద్ద ఆసీస్ ఇన్నింగ్స్ ఓవర్.. భారత బౌలర్లందరూ?

హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్‌లో తొలిరోజు టీమిండియా ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ ఓడి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత జట్టు ఒకటి రెండు సార్లు

హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్‌లో తొలిరోజు టీమిండియా ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ ఓడి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత జట్టు ఒకటి రెండు సార్లు తడబడినప్పటికీ ఆపై తన ఆటతీరుతో ఆకట్టుకుంటుంది. దీంతో 88.3 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా జట్టు 300 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. 
 
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా క్రికెటర్లలో వార్నర్‌కు భారత బౌలర్లు లైఫ్ ఇచ్చారు. దీంతో వార్నర్ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే రెండో ఓవర్లో ఉమేష్ యాదవ్ రెన్ షా (1) వికెట్ తీసి షాక్ ఇచ్చాడు. కానీ ఆపై క్రీజులో కుదురుకుని నిలకడగా ఆడిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ (111), వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (56) సూపర్ ఇన్నింగ్స్ ఆడటంతో జట్టు స్కోరు పరుగులు తీసింది. అయితే కుల్ దీప్ యాదవ్ వార్నర్‌ను పెవిలియన్‌కు పంపాడు. 
 
అనంతరం స్మిత్‌కు జత కలిసిన షాన్ మార్ష్ (8)ను ఉమేష్ యాదవ్ బోల్తా కొట్టించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హ్యాండ్స్ కొంబ్ (4), మ్యాక్స్ వెల్ (8)ను కుల్‌దీప్ పెవిలియన్ చేర్చాడు. అనంతరం సెంచరీతో కదం తొక్కిన స్మిత్ (111) ను అశ్విన్ అవుట్ చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆపై క్రీజులోకి దిగిన కుమ్మిన్స్‌ను (21) కుల్ దీప్ యాదవ్ అవుట్ చేశాడు. ఒకీఫ్ (8)ను రన్ అవుట్ అయ్యాడు. కానీ మాథ్యూ వేడ్ మెరుగ్గా ఆడి.. భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. అయితే 51 పరుగుల వద్ద జడేజా అతనిని బౌల్డ్ చేశాడు. 
 
చివర్లో లియాన్ (13)ను పుజారా చక్కని క్యాచ్‌తో పెవిలియన్ దారి పట్టించాడు. దీంతో హాజిల్ వుడ్ (2) నాటౌట్ గా నిలిచాడు. దీంతో మొత్తం 88.3 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా జట్టు 300 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. భారత్ బౌలర్లలో కుల్ దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో రాణించగా, రెండు వికెట్లతో ఉమేష్ యాదవ్ ఆకట్టుకున్నాడు. అశ్విన్, జడేజా, భువనేశ్వర్ కుమార్ చెరొక వికెట్ తీసి వారికి చక్కని సహకారం అందించారు. టీమిండియా బౌలర్లంతా వికెట్లు తీయడం విశేషం.