Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నీతిమంతమైన ఫాస్ట్ బౌలర్ నెహ్రా : షోయబ్ అక్తర్

శుక్రవారం, 3 నవంబరు 2017 (15:41 IST)

Widgets Magazine
shoib akhtar

రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్‌ చాలా రోజులుకు ఓ మంచి కామెంట్ చేశారు. అదీ కూడా ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన భారత బౌలర్ అశీష్ నెహ్రా గురించి. ఈ కామెంట్స్ ప్రతి ఒక్కరి మనసును హత్తుకునేలా ఉంది. దీనికి సంబంధించిన ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఢిల్లీకి చెందిన 38 ఏళ్ల వయసున్న నెహ్రా, సొంత మైదానమైన ఫిరోజ్ షా కోట్లాలో ఇటీవల న్యూజిల్యాండ్‌తో టీ-20ని ఆడి, తన 18 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికిన సంగతి తెలిసిందే. 
 
దీనిపై అక్తర్ ట్వీట్ చేస్తూ, తనతో పాటు ఆడిన నీతిమంతమైన ఫాస్ట్ బౌలర్లలో నెహ్రా ఒకడని కొనియాడాడు. ఆయనతో కలసి ఆడటం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని, నెహ్రా స్వతహాగా ఓ మంచి వ్యక్తని అన్నాడు. 
 
తదుపరి నెహ్రా తన జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. తన కెరీర్‌లో పలుమార్లు ఎత్తు పల్లాలను ఎదుర్కొన్న నెహ్రా, ఫిట్నెస్ నిరూపించుకుని తిరిగి ప్రధాన జట్టులో స్థానం పొందిన సందర్భాలు అనేకం ఉన్నాయని అక్తర్ తన ట్వీట్‌లో గుర్తు చేశాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

కోహ్లీ అత్యుత్సాహం.. వాకీ టాకీ వాడి చిక్కుల్లో పడ్డాడు.. ఐసీసీ క్లీన్ చిట్

వాకీ టాకీ వాడిన వ్యవహారంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కోహ్లీకి క్లీన్ చిట్ ...

news

టీ20లో కివీస్‌ను చితక్కొట్టారు... పొట్టి ఫార్మాట్‌లో భారత్ తొలి విజయం

ఢిల్లీ వేదికగా బుధవారం రాత్రి జరిగిన తొలి ట్వంటీ20లో పర్యాటక జట్టు న్యూజిలాండ్‌ను విరాట్ ...

news

పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు చేతబడి చేయించారట!

క్రికెట్‌లో గెలుపోటములు సహజమే. జట్టులోని సభ్యులంతా సమిష్టిగా ఆడుతూ, అన్ని విభాగాల్లో ...

news

నేడు తొలి టీ20 : కివీస్‌ను కోహ్లీ సేన చిత్తు చేసేనా?

భారత పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ జట్టు ఆతిథ్య కోహ్లీ సేనతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ...

Widgets Magazine