ట్వంటీ20 వరల్డ్ కప్ : ఇండోఇంగ్లండ్ మ్యాచ్‌కు అంపైర్లుగా ధర్మసేన - రీఫెల్
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్నాయి. ఈ నెల 9వ తేదీ నుంచి సెమీ ఫైనల్ మ్యాచ్‌లు ఆరంభమవుతాయి. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ - పాకిస్థాన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మొదలవుతుంది. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కోసం ఫీల్డ్ అంపైర్లను ఐసీసీ ప్రకటించింది.
రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌కు కుమార ధర్మసేన (శ్రీలంక), పాల్ రీఫెల్ (ఆస్ట్రేలియా)లను అంపైర్లుగా ఎంపిక చేశారు. న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గఫానేను థర్డ్ అంపైర్‌గా నియమించారు.
అలాగే, న్యూజిలాండ్ - పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌కు మారిస్ ఎరాస్మస్ (సౌతాఫ్రికా), రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లండ్) బాధ్యతలు నిర్వహిస్తారు. రిచర్డ్ కెటిలోబరో (ఇంగ్లండ్)ను థర్డ్ అంపైర్‌గా ఎంపిక చేశారు. 13వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్‌కు సెమీ ఫైనల్ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత ఎంపిక చేస్తామని ఐసీసీ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.