Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చాంపియన్స్ ట్రోఫీ : భారత్‌కు చావో రేవో.. గెలిస్తేనే సెమీస్‌కు.. మ్యాచ్ రద్దు అయితే?

ఆదివారం, 11 జూన్ 2017 (10:30 IST)

Widgets Magazine
virat kohli

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య అత్యంత కీలక మ్యాచ్ జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్ష భయం పట్టుకుంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ ప్రాంతమంతా మబ్బులు పట్టి ఉండగా, శనివారం కూడా ఇక్కడ భారీ వర్షం కురిసింది. దీంతో ఆదివారం జరిగే మ్యాచ్ వర్షార్పణమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షం పడి మ్యాచ్ ఆగిపోతే విరాట్ కోహ్లీ సేన సెమీస్‌కు చేరుకుంది. 
 
అలాకాకుండా మ్యాచ్ జరిగి సఫారీల చేతిలో ఓడిపోతే మాత్రం ఇంటికి బయలుదేరాల్సి ఉంటుంది. దీనికి కారణం గ్రూప్ - బిలోని అన్ని జట్లూ తలా రెండు పాయింట్లతో ఉండగా, భారత్ మిగతా జట్లతో పోలిస్తే మెరుగైన రన్ రేటుతో మొదటి స్థానంలో ఉంది. మ్యాచ్ రద్దయితే దక్షిణాఫ్రికా, భారత్‌లకు చెరో పాయింట్ వస్తుంది.
 
అదే జరిగితే, 1.272 నెట్‌రన్ రేటుతో ఉన్న భారత్ మరో గణాంకం చూడకుండా సెమీస్‌కు వెళుతుంది. గ్రూప్ -బీలోని చివరి మ్యాచ్ సోమవారం శ్రీలంక, పాకిస్థాన్ మధ్య జరగనుండగా, ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు సెమీస్‌కు చేరుతుంది. ఒకవేళ సోమవారం జరిగే మ్యాచ్ కూడా రద్దయితే, దక్షిణాఫ్రికా సెమీస్‌కు వస్తుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

ఆ మహిళతో సెల్ఫీ దిగితే గోల్డెన్ డకౌట్ కావాల్సిందే.. జట్టూ ఓడిపోవాల్సిందే.. ఎవరామె?

జైనాబ్ అబ్బాస్. ఈ పేరు ఇపుడు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఇంతకీ ఈమె ఎవరన్నదే కదా మీ ...

news

చాంపియన్స్ ట్రోఫీ : న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించిన బంగ్లాదేశ్

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నుంచి న్యూజిలాండ్ జట్టు ...

news

కెప్టెన్‌ కోహ్లి చెప్పాడని కుంబ్లేను మారిస్తే బోర్డు గతేమిటి? కోచ్‌ మార్పుపై సందిగ్ధంలో బీసీసీఐ

భారత క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్ కూడా చేయలేని సాహసానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ...

news

ఒక్క గేమ్ పోయింది.. కోహ్లీపై అందరూ ఫైర్.. పాక్‌ను చూసి నేర్చుకోమంటున్నారే..

చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టు.. అండర్ ...

Widgets Magazine