గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 అక్టోబరు 2022 (15:44 IST)

23న టీ20వ వరల్డ్ కప్ : హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టిక్కెట్లు

india - pakistan
ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ 20 ప్రపంచ కప్ టోర్నీ ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఇందులోభాగంగా, ఈ నెల 23వ తేదీన దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది. మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్ కోసం 90 వేల టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయని నిర్వాహకులు వెల్లడించారు. ఈ మెగా టోర్నీకే దాయాదుల పోరు హైలెట్‌గా నిలువనుంది.
 
ఎంసీబీ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో అన్ని టిక్కెట్లు అమ్ముడుపోయినట్టు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అధికారులు వెల్లడించారు. స్టేడియంలో సీటింగ్ కెపెసిటీ 90 వేలు కాగా, మొత్తం టిక్కెట్లు విక్రయానికి పెట్టగా అన్ని టిక్కెట్లు హాట్ కేకుల్లో అమ్ముడు పోయాయని వారు తెలిపారు. 
 
ఇక మరిన్ని టిక్కెట్లు కోసం క్రికెట్ ఫ్యాన్స్ చూస్తున్న విషయాన్ని పసిగట్టి, స్టేడియంలో నిలుచుని మ్యాచ్‌ను తిలకించే విధంగా కొన్ని అదనపు టిక్కెట్లను విడుదల చేయగా, ఈ టిక్కెట్లు కేవలం 10 నిమిషాల్లోనే అమ్ముడైపోయినట్టు తెలిపారు. దీంతో మ్యాచ్ టిక్కెట్ కౌంటర్లలో సోల్డ్ ఔట్ బోర్డులు దర్శనమిస్తాయి.