Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఐసీసీ వరల్డ్ కప్: స్మృతి అజేయ సెంచరీ.. విండీస్‌పై భారత్ ఘనవిజయం

శుక్రవారం, 30 జూన్ 2017 (09:50 IST)

Widgets Magazine

ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సెంచరీ చేజార్చుకున్న టీమిండియా ఓపెనర్ స్మృతి వెస్టిండీస్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో అజేయ శతకంతో జట్టును గెలిపించింది. తొలుత విండీస్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.

విండీస్ బ్యాట్స్ విమెన్‌లలో హేలీ మాథ్యూస్ (43), షానెల్ డాలీ (33), ఆఫీ ఫ్లెచర్ (36) మినహా మరెవరూ రాణించలేదు. ఫలితంగా 8వికెట్ల నష్టానికి విండీస్ 183 పరుగులు సాధించింది. భారత్ బౌలర్లలో హర్మన్‌ప్రీత్ కౌర్, పూనమ్ యాదవ్, దీప్తి శర్మ రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టగా ఎక్తా బిష్త్ ఓ వికెట్ నేల కూల్చింది.
 
అనంతరం 184 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో 45 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ స్మృతి మందన 108 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 106 పరుగులతో శతక్కొట్టగా.. జట్టుకు విజయం సునాయాసమైంది.

కెప్టెన్ మిథాలీ రాజ్ (46) పరుగులు చేయగా పూనమ్ రౌత్ డకౌట్ కాగా మోనా మెష్రమ్ (18) పరుగులు చేసింది. అజేయ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన స్మృతి మందన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మందనకు దక్కింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

మన్‌మోహన్ సింగ్ లాంటి యస్ బాస్ రవిశాస్త్రి.. అందుకే కోహ్లీకి అతడంటే అంత ఇష్టం

మొత్తానికి విరాట్ కోహ్లీ యస్ బాస్ రకం కోచ్‌నే తెచ్చుకుంటున్నాడు. తన మాట వింటే చాలు ...

news

స్వేచ్ఛగా వదిలేసే కోచ్‌ని కోరుకుంటున్నారా.. జట్టు చంకనాకిపోతుందన్న గవాస్కర్

టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లేని అత్యంత అవమానకరంగా సాగనంపిన తీరుపై తొలి నుంచి ...

news

కోహ్లీకి తానా అంటున్న సచిన్.. ఇక రవిశాస్త్రి కోచ్‌గా పగ్గాలు పట్టడమే తరువాయి..!

ఎవరూ ఊహించని విధంగా టీమిండియా కోట్ పదవికి చివరి నిమిషంలో రవిశాస్త్రి దరఖాస్తు ...

news

భారత్ క్రికెట్‌ను కొత్త ఎత్తులకు తీసుకెళ్లే సత్తా కోహ్లిది.. బలిపశువును చేయవద్దు

టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే అర్థాంతర రాజీనామా వెనుక కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రమేయం ...

Widgets Magazine