Widgets Magazine

నీవేమైనా ఆయనతో పడుకున్నావా?: ఇంజమామ్ మేనల్లుడి ప్రశ్న

ఆదివారం, 16 సెప్టెంబరు 2018 (13:57 IST)

పాకిస్థాన్ మాజీ కెప్టెన్, ప్రస్తుత చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ మేనల్లుడు ఇమామ్ ఉల్ హక్.. పాకిస్థాన్ ఓపెనర్‌గా ఆడుతున్న సంగతి తెలిసిందే. భారత జర్నలిస్ట్ అడిగిన ఓ ప్రశ్నపై ఇమామ్ ఉల్ హక్ అసహనం వ్యక్తం చేశాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే శ్రీలంకపై సెంచరీ సాధించి ఈ ఓపెనర్‌ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన అతనికి విలేకరి నుంచి ఓ సరదా ప్రశ్న ఎదురైంది. ''మీ మామ ఇంజుమామ్‌ ఉల్‌ హక్‌ చాలా సేపు నిద్రపోయేవాడు. నీవు కూడా అతనిలా నిద్రపోతావా?'' అని విలేకరి అడిగాడు. 
 
దీనికి ఆగ్రహానికి లోనైన ఇమామ్‌.. ''మా మామ చాలాసేపు నిద్రపోతాడని నీకెలా తెలుసు? నీవేమైనా ఆయనతో పడుకున్నావా?'' అని ఎదురు ప్రశ్నించాడు. దీంతో అక్కడున్న జర్నలిస్ట్‌లు అవాక్కయ్యారు. సరదాగా అడిగిన ప్రశ్నకు ఇంత సీరియస్‌ అవ్వడం ఏంటని ఆశ్చర్యపోయారు. 
 
అంతేగాకుండా ఇటీవల ఇమామ్‌ మీడియాపై అసహనం వ్యక్తం చేశాడు. తన మామ ఇంజుమామ్‌ వల్లే తనకు జట్టులో చోటు దక్కిందన్న మీడియా విమర్శలపై స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంజుమామ్‌ తనకు మేనమామ కావడం తన తప్పు కాదని స్పష్టం చేశాడు. విమర్శలకు తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పానని, ఆసియాకప్‌లో సైతం రాణిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. 
 
ఆసియాకప్‌లో ప్రతి మ్యాచ్‌ తనకు ముఖ్యమేనని, భారత్‌తో మ్యాచ్‌ తనకేం ప్రత్యేకం కాదని ఇంజమామ్ ఉల్ హక్ తెలిపాడు. కాగా గతేడాది అక్టోబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఇమామ్‌ ఇప్పటికే వన్డేల్లో 4 సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కోహ్లీకి విశ్రాంతి అవసరమా?

ఆసియా కప్ వన్డే టోర్నమెంట్‌ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ...

news

ఆసియా కప్ టోర్నీ- షెడ్యూల్ ఇదే.. రికార్డుల కోసం రోహిత్ సేన రెఢీ

ఆసియా కప్ టోర్నీ కోసం టీమిండియా సన్నద్ధమైంది. 15 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో ...

news

హిజ్రాగా మారిన భారత మాజీ క్రికెటర్.. ఎవరు?

భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ హిజ్రాగా మారిపోయాడు. అచ్చం హిజ్రాల్లాగానే చీరకొట్టి.. ...

news

కెప్టెన్సీని ఎందుకు వదులుకున్నానంటే... ధోనీ క్లారిఫై

భారత క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్సీని తాను ఎందుకు వదులుకున్నానో మాజీ కెప్టెన్ మహేంద్ర ...

Widgets Magazine