శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 13 జులై 2016 (18:45 IST)

ఇమ్రాన్ మూడో భార్య ఫోటో లీక్... మరియమ్ మైకంతో ప్లాటైన 63 ఏళ్ల ఖాన్...

నా పెళ్లి చెప్పే చేసుకుంటానంటూ చెప్పుకొచ్చిన పాకిస్తాన్ క్రికెట్ మాజీ కెప్టెన్, పాకిస్థాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) అధినాయకుడు ఇమ్రాన్ ఖాన్ చెప్పకుండానే పెళ్లి చేసేసుకున్నాడు. మరియమ్ అనే పేరు కలిగిన యువతిని చూడగానే ఇమ్రాన్ ఖాన్ గుండె ప్రేమలో మునిగి

నా పెళ్లి చెప్పే చేసుకుంటానంటూ చెప్పుకొచ్చిన పాకిస్తాన్ క్రికెట్ మాజీ కెప్టెన్, పాకిస్థాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) అధినాయకుడు ఇమ్రాన్ ఖాన్ చెప్పకుండానే పెళ్లి చేసేసుకున్నాడు. మరియమ్ అనే పేరు కలిగిన యువతిని చూడగానే ఇమ్రాన్ ఖాన్ గుండె ప్రేమలో మునిగిపోయిందట. ఆమెను చూడగానే ఇక పెళ్లి చేస్కుని తీరాల్సిందే అనే నిర్ణయానికి వచ్చేడట. 
 
దీనితో ఇప్పటికే ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చిన ఇమ్రాన్ ఖాన్ ముచ్చటగా మూడోభార్యను కట్టేసుకున్నట్లయింది. ఇమ్రాన్ ఖాన్ లండన్ నగరంలో అత్యంత సన్నిహితులను పిలిచి పెళ్లి తంతు ముగించేసుకున్నట్లు లండన్ మీడియా కోడై కూస్తోంది. కానీ పాకిస్తాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్(పీటీఐ) మాత్రం ఈ వార్తలను ఖండించింది. ఇమ్రాన్ పెళ్లి చేసుకోలేదని చెపుతోంది. కాగా మరియమ్ అనే యువతిది పాకిస్తాన్ లోని పంజాబ్ ఫ్రావిన్స్‌లోని మనేక కుటుంబానికి చెందినదిగా చెపుతున్నారు.