శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 జనవరి 2023 (23:16 IST)

కివీస్‌తో తొలి ట్వంటీ-20: టీమిండియా పరాజయం

team india
కివీస్‌తో జరిగిన తొలి ట్వంటీ-20లో టీమిండియా ఓటమిని చవిచూసింది. కివీస్‌పై వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా..  ట్వంటీ-20 సిరీస్ తొలి మ్యాచ్‌లోనే తేలిపోయింది. రాంచీలో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ విజయంతో కివీస్ మూడు టీ-20ల సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో వుంది. 
 
న్యూజిలాండ్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (50) చివర్లో అర్థసెంచరీతో పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. 
 
కివీస్ బౌలర్లలో మైకేల్ బ్రేస్వెల్ రెండు, కెప్టెన్ శాంటర్న్ 2, ఫెర్గుసన్ 2, డఫీ 1, సోధీ 1 వికెట్ పడగొట్టారు. అంతకుముందు కివీస్ జట్టు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది.