సోమవారం, 25 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 జులై 2023 (11:59 IST)

వెస్టిండీస్‌తో తొలి టెస్టు- 700 వికెట్లతో రవిచంద్రన్ అశ్విన్ రికార్డు

ashwin
డొమినికా వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 64.3 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది. అలిక్ అథానాస్ ఒక్కడే 47 పరుగులు చేశాడు. భారత్ తరఫున అశ్విన్ 5 వికెట్లు, జడేజా 3 వికెట్లు తీశారు.
 
ఈ సందర్భంగా భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌లో 700 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. 700 వికెట్లు తీసిన 3వ ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. అనిల్ కుంబ్లే టెస్టు క్రికెట్‌లో 477 వికెట్లు, వన్డేల్లో 151 వికెట్లు, టీ20ల్లో 72 వికెట్లు తీశాడు. హర్భజన్ సింగ్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో 700 వికెట్లు పడగొట్టారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన టాప్-5 ఆటగాళ్లు ఎవరంటే..
అనిల్ కుంబ్లే - 449 ఇన్నింగ్స్‌లలో 953 వికెట్లు
హర్భజన్ సింగ్ - 442 ఇన్నింగ్స్‌లలో 707 వికెట్లు
రవిచంద్రన్ అశ్విన్ - 351 ఇన్నింగ్స్‌లలో 702* వికెట్లు
కపిల్ దేవ్ - 448 ఇన్నింగ్స్‌లలో 687 వికెట్లు
జహీర్ ఖాన్ - 373 ఇన్నింగ్స్‌లలో 597 వికెట్లు.