సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 ఆగస్టు 2023 (20:22 IST)

నెట్ సెషన్.. హార్దిక్ పాండ్యా బంతికి గాయపడిన బాలిక.. తర్వాత ఏం జరిగింది?

hardik pandya
భారత్-వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్ జరుగుతోంది. వెస్టిండీస్ తొలి రెండు మ్యాచ్‌లను గెలిచి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ క్లిష్ట వాతావరణంలో 3వ మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 
 
ఈ సందర్భంగా ఈ మ్యాచ్‌లో, ఒక ఆసక్తికర సంఘటన జరుగుతోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ మ్యాచ్‌కు ముందు హార్దిక్ పాండ్యా శిక్షణలో ఉన్నాడు. అప్పుడు అతను కొట్టిన బంతి ఒక అమ్మాయికి తగిలింది. దీంతో బాలిక వెంటనే బీసీసీఐ వైద్య బృందాన్ని ఆశ్రయించింది. దీంతో మ్యాచ్ పూర్తయ్యే వరకు వేచి ఉండాల్సిందిగా పాండ్యా బాలికను కోరాడు. 
 
మ్యాచ్ ముగిసిన తర్వాత అతను సంతకం చేసిన బంతిని అమ్మాయికి బహుమతిగా అందించాడు. ఆ అమ్మాయి దాన్ని తీసుకుని హ్యాపీగా స్టేడియం నుంచి వెళ్లింది.