1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 2 మార్చి 2015 (13:53 IST)

ఐసీసీ సహకారం వల్లే భారత్‌కు వరుస విజయాలు : పాక్ మాజీ పేసర్!

ప్రపంచ కప్ టోర్నీలో భారత్‌పై ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేక తీవ్ర అవమానాలు పాలవుతున్న పాకిస్థాన్ జట్టు భారత్‌పై ఏదో ఒక అసత్య ఆరోపణ చేసేందుకు సిద్ధంగా ఉంది. తాజా వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్-బీలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియాపై పాక్ మాజీ ఫేసర్ సర్ఫరాజ్ నవాజ్ తన అక్కసుకు వెళ్లగక్కాడు. 
 
టీమిండియాకు ఐసీసీ అనుకూలంగా వ్యవహరిస్తోందని, ఈ కారణంగానే ధోనీ సేన వరుస విజయాలను సాధిస్తోందని అతడు వ్యాఖ్యానించాడు. ‘ఇప్పటిదాకా భారత్ ఆడిన మ్యాచ్‌లు చూడండి. ఆ జట్టుకు అనువైన పిచ్‌లను తయారుచేయడంలో ఐసీసీ ఆసక్తి కనబరుస్తోంది. ఇప్పటికైనా పాక్ క్రికెట్ బోర్డు మేల్కోవాలి. ఐసీసీ వద్ద ఈ విషయాన్ని లేవనెత్తి, జరుగుతున్న తంతు ఏమిటో నిగ్గు తేల్చాలి’ అని అతడు ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడిన సందర్భంగా పేర్కొన్నాడు.