1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 28 ఫిబ్రవరి 2015 (19:14 IST)

టీమిండియా హ్యాట్రిక్ విజయం: క్రికెట్ పసికూన యూఏఈపై విన్!

టీమిండియా హ్యాట్రిక్ విజయం సాధించింది. వరల్డ్ కప్‌లో వరుసగా మూడో విజయాన్ని ధోనీసేన తన ఖాతాలో వేసుకుంది. పెర్త్‌లో ఏకపక్షంగా సాగిన పోరులో టీమిండియా ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. క్రికెట్ పసికూన యూఏఈపై ధోనీ గ్యాంగ్ ఆడుతూ పాడుతూ విజయాన్ని నమోదు చేసుకుంది. 
 
103 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 18.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. ధావన్ సింగల్ డిజిట్ కె వెనుదిరిగినప్పటికీ  రోహిత్ శర్మ (57 నాటౌట్), విరాట్ కోహ్లీ (33 నాటౌట్)తో మెరుగ్గా రాణించడంతో భారత్ విజయం సాధించింది. 
 
అంతకుముందు మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యుఏఈ జట్టు భారత బౌలర్ల ధాటికి కేవలం 102 పరుగులకే కుప్పకూలింది. ముఖ్యంగా భారత స్పిన్ తాకిడికి విలవిల్లాడిపోయింది. ఆ జట్టులో అన్వర్ (35), ఖుర్రుమ్ ఖాన్ (14), గురుజ్ (10)లు మినహా మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు. 
 
అదనపు పరుగుల రూపేణా భారత బౌలర్లు 13 పరుగులు సమర్పించడం గమనార్హం. భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు తీయగా, యాదవ్, జడేజాలు రెండేసి వికెట్లు, కుమార్, శర్మలు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. నాలుగు వికెట్లు పడగొట్టిన అశ్విన్ కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.