Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భారత్ క్రికెట్ జట్టు ఇంగ్లండ్ టూర్ షెడ్యూల్ ఇదే...

బుధవారం, 6 సెప్టెంబరు 2017 (12:50 IST)

Widgets Magazine
lords stadium

ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లో భాగంగా, భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వచ్చే యేడాది జూలై నెల 3వ తేదీ నుంచి ఈ పర్యటన ప్రారంభమవుతుంది. మొత్తం మూడు నెలల పాటు టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై గడపనుంది. ఈ షెడ్యూల్ వివరాలను ఇంగ్లండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) అధికారికంగా ప్రకటించింది. 
 
ఈ షెడ్యూల్‌లో ఐదు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందుకోసం సెప్టెంబర్ రెండో వారం వరకు ఇంగ్లండ్‌లో టీమిండియా పర్యటించనుంది. తొలి టీ20 మ్యాచ్ జులై 3వ తేదీ న మాంచెస్టర్‌ వేదికగా జరగనుంది. తొలుత ట్వంటీ-20, ఆ తర్వాత వన్డే సిరీస్, పిమ్మట టెస్ట్ సిరీస్‌లను భారత్ ఆడనుంది. ఈ షెడ్యూల్ ఇదే... 
 
2018 జూలై 3న మాంచెష్టర్ వేదికగా మొదటి టీ20 మ్యాచ్. 
జులై 6న కార్డిఫ్ వేదికగా రెండో టీ20 మ్యాచ్.
జులై 8న బ్రిస్టల్ వేదికగా మూడో టీ20 మ్యాచ్.
జులై 12న నాటింగ్ హామ్ వేదికగా తొలి వన్డే మ్యాచ్.
జులై 14న లార్డ్స్ వేదికగా రెండో వన్డే మ్యాచ్.
జులై 17న లీడ్స్ వేదికగా మూడో వన్డే మ్యాచ్.
ఆగస్టు 1 నుంచి 5 వరకు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్.
ఆగస్టు 9 నుంచి 13 వరకు లార్డ్స్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్.
ఆగస్టు 18 నుంచి 22 వరకు నాటింగ్ హామ్ వేదికగా మూడో టెస్టు ‌మ్యాచ్.
ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్‌ 3 వరకు సౌతాంప్టన్ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్.
సెప్టెంబర్‌ 7 నుంచి 11వ తేదీ వరకు లార్డ్స్ వేదికగా ఐదో టెస్టు మ్యాచ్ జరగనుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

ఏడవకు చిట్టితల్లీ జోహ్రా... మీకు నేనున్నా... గౌతం గంభీర్

జమ్ము-కాశ్మీరులోని అనంతనాగ్ ఉగ్రవాద దాడిలో అమరవీరుడైన ఏఎస్ఐ అబ్దుల్ రషీద్ కుమార్తె జోహ్రా ...

news

సామర్థ్యం ఉంది.. కానీ చిత్తుగా ఓడాం... ఉపుల్ తరంగ

తమ క్రికెట్ జట్టులోని సభ్యులందరికీ పూర్తి సామర్థ్యం ఉందనీ కానీ మైదానంలో దాన్ని ...

news

ఐసీసీ ర్యాంకింగ్స్ : 887 పాయింట్లతో కోహ్లీ నెం.1

ఐసీసీ వెల్లడించిన ర్యాంకింగ్స్ పట్టికలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ...

news

ఐపీఎల్ మీడియా హక్కులు రూ.16 వేల కోట్లు.. ఎవరికి సొంతం?

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ మీడియా ...

Widgets Magazine