సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 జనవరి 2023 (20:29 IST)

ట్వంటీ-20 ప్రపంచకప్ గెలిచారు.. స్టెప్పులు ఇరగదీశారు.. (వీడియో)

India U-19 Women's Cricketers
India U-19 Women's Cricketers
ట్వంటీ-20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత భారత అండర్-19 మహిళా క్రికెటర్లు 'కాలా చాస్మా' పాటకు స్టెప్పులేశారు. యువ మహిళా క్రికెటర్లు తమ భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయారు. బాగా పాపులర్ అయిన బాలీవుడ్ నెంబర్ "కాలా చాస్మా" ట్యూన్‌కు స్టెప్పులేశారు. 
 
భారత అండర్-19 మహిళల జట్టు సభ్యులు కొన్ని అద్భుతమైన నృత్య కదలికలను వీడియోలో చూడవచ్చు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అధికారిక హ్యాండిల్ ద్వారా ఒక వీడియో క్లిప్ పోస్ట్ చేయబడింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.  
 
మరోవైపు దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌ నెగ్గిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఈ విజయానికి పురస్కారంగా యంగ్‌ ఇండియాకు రూ. 5 కోట్లు అందించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)