శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 7 జనవరి 2019 (10:54 IST)

కల నిజమైంది... 72 యేళ్ళ తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై భారత్ విజయం

ఆస్ట్రేలియా గడ్డపై భారత్ చరిత్ర సృష్టించింది. 72 యేళ్లుగా ఊరిస్తూ వచ్చిన టెస్ట్ సిరీస్ విజయ కలను నిజం చేసింది. నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరిస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఫలితంగా ఆస్ట్రేలియా గడ్డపై కంగారులను కంగారుబెట్టిన క్రికెట్ జట్టుగా కోహ్లీ సేన సరికొత్త రికార్డును నెలకొల్పింది. 
 
ఆస్ట్రేలియా గడ్డపై భారత తన క్రికెట్ పర్యటనను తొలిసారి 1947-48 సంవత్సరంలో ప్రారంభించింది. కానీ, ఇప్పటివరకు ఒక్క టెస్ట్ సిరీస్‌ను కూడా కైవసం చేసుకోలేక పోయింది. కదా, ఇప్పటివరకు ఆస్ట్రేలియా గడ్డపై 47 టెస్ట్ మ్యాచ్‌లు ఆడితే భారత్ కేవలం ఏడు మ్యాచ్‌లలోనే విజయం సాధించింది. అలా పేలవ రికార్డు కలిగిన భారత్.. ఇపుడు ఒక టెస్ట్ సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 
 
సిడ్నీ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత తన తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 622 పరుగులు చేసింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు 300 పరుగులకు ఆలౌటై రెండో ఇన్నింగ్స్‌ కోసం ఫాలోఆన్ ఆడింది. అయితే, ఆ జట్టు స్కోరు 24 పరుగుల వద్ద ఉండగా వరుణ దేవుడు మ్యాచ్‌కు అంతరాయం కలిగించాడు. ఫలితంగా మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. దీంతో గవాస్కర్ - బోర్డర్ టెస్ట్ సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 
 
కాగా, భారత్ అడిలైడ్ వేదికగా జరిగిన టెస్టులో భారత్ 31 పరుగులతోనూ, మెల్‌బోర్న్ టెస్టులో 137 పరుగులతో విజయం సాధించింది. ఒక టెస్టులో ఆస్ట్రేలియా గెలుపొందింది. సిడ్నీ టెస్ట్ డ్రాగా ముగిసింది. ఫలితంగా 2-1 తేడాతో భారత్ టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంది.