Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కోహ్లీకి ఏకాగ్రత లేదు.. నెగటివ్ ఆలోచనలు ఏర్పడ్డాయి: మార్క్ వా

మంగళవారం, 7 మార్చి 2017 (13:08 IST)

Widgets Magazine
Kohli

సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత్ రాణించలేకపోతోంది. ఇంగ్లండ్‌ను సునాయాసంగా మట్టికరిపించిన టీమిండియా.. కంగారూల చేతిలో చిక్కుకుని విలవిల్లాడిపోతున్నారు. ఇందుకు కారణాన్ని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ వా చెప్పాడు. ఇందుకు కారణం ప్రపంచ స్థాయి ఆటగాడిగా పేరొందిన భారత స్టార్ క్రికెటర్, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏకాగ్రత కోల్పోవడమేనని చెప్పారు. 
 
బెంగళూరులో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ పేలవ ప్రదర్శనతో కేవలం 12 పరుగులకే ఔట్ అయి పెవిలియన్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లి అంపైర్‌ను రివ్యూ కోరడం.. అందులో కోహ్లి ఎల్‌బీడబ్ల్యూగా ప్రకటించడంతో కోహ్లి చేసేదేమీ లేక నిరాశతో వెనుదిరిగాడు. అద్భుతమైన ఆటగాడిగా కోహ్లి ఎన్నో సెంచరీలు, డబుల్ సెంచరీలు చేసి కూడా ఎల్‌డబ్లును అంచనా వేయలేకపోవడం తనను విస్మయానికి గురిచేసిందని అభిప్రాయపడ్డాడు. వరుస ఇన్నింగ్స్‌లలో విఫలం వస్తు ఉండటంతో కోహ్లిలో నెగటివ్ ఆలోచనలు ఏర్పడి ఏకాగ్రత కోల్పోవడానికి దారితీస్తుందని మార్క్ వా విమర్శించాడు.
 
అద్భుతాలు చేస్తాడనకుంటే విరాట్ పేలవ ప్రదర్శనతో అనవసర తప్పిదాలతో వికెట్ కోల్పోతూ వస్తున్నాడని మార్క్ వా ఎద్దేవా చేశాడు. జట్టుకు అండగా నిలబడాల్సిన సారథి మధ్యలోనే నిష్క్రమిస్తే.. టీమ్‌లోని మిగతా సభ్యులపై ఆ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని చెప్పాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

బెంగుళూరు టెస్ట్ : భారత్‌ను నడ్డివిరిచిన హాజెల్‌వుడ్.. భారత్ 274 ఆలౌట్

బెంగుళూరు వేదికగా జరుగున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్ హాజెల్‌వుడ్ బంతితో ...

news

కోహ్లీ తీరు దారుణం.. ప్రత్యర్థి ఆటగాడిని టాయ్‌లెట్ అంటూ స్జెడ్జింగ్ చేస్తాడా?

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యవహరిస్తున్న తీరు మాత్రం చాలా దారుణంగా ఉందని ఆసీస్ ...

news

బెంగళూరు టెస్ట్.. భారత బౌలర్ల చెత్త బౌలింగ్... ఆస్ట్రేలియా స్కోరు 237/6

భారత్-ఆస్ట్రేలియా మధ్య బెంగళూరులో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ ఆట ముగిసే సమయానికి ఆసీస్ ...

news

పాముపడగను కొట్టా: కోహ్లీ వికెట్ తీయడంపై నాథన్ లియోన్ సంబరం

పాము పడగ లాంటి విరాట్ కోహ్లీ వికెట్‌ను తీసినందుకు తనకు సంబంరంగా ఉందని ఆసీస్ట్ స్పిన్నర్ ...

Widgets Magazine