బుధవారం, 1 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 నవంబరు 2022 (10:34 IST)

ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ : నేడ్ భారత్ వర్సెస్ బంగ్లాదేశ్

team india
ఐసీసీట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలోభాగంగా, బుధవారం భారత్ మరో కీలక మ్యాచ్‌ను ఆడనుంది. బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి దర్జాగా సెమీస్‌లో అడుగుపెట్టాలన్న ఆకాంక్షతో టీమిండియా సభ్యులు ఉన్నారు. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడితో భారత్ సెమీస్ ప్రవేశం కోసం శ్రమించాల్సివుంటుంది. 
 
అయితే, ఈ కీలక మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి. దీంతో భారత క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా, భారత్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండింటిలో గెలుపొందింది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిని చవిచూసింది. 
 
తుది జట్ల అంచనా.. 
 
బంగ్లాదేశ్ : హుస్సేన్ శాంటో, సౌమ్య సర్కార్, దాస్, హాసన్, హొస్సేన్, యాసిర్ అలీ, మొసద్దెక్ హోస్సేన్, హాసన్, రెహమాన్, మహమూద్, అహ్మద్.
 
భారత్ : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్.